telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

పుల్వామా ప్రభావం : పాక్ తో క్రికెట్ రద్దు .. ! ఫోటోలు కూడా తొలగించేశారు.. !

no cricket matches with pak is a demand

కాశ్మీర్ లో ని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదుల దాడి ప్రభావం దేశంపై తీవ్రంగా ప్రభావితం చూపింది. దీనితో అనేక వర్గాల నుండి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న భారత్-పాక్ క్రికెట్ సంబంధాలపై కూడా ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాడికి నిరసనగా ఇప్పటికే ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ కెప్టెన్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలగించింది. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి డీస్పోర్ట్స్, ఐఎంజీ-రిలయన్స్ తప్పుకున్నాయి. తాజాగా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను సైతం టీమిండియా బహిష్కరించాలని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి.

ఈ ఘటనపై సీసీఐ కార్యదర్శి సురేశ్ బఫ్నా మాట్లాడుతూ… జవాన్లపై దాడి జరిగిన నాటి నుంచి నేటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందుకు రాలేదని మండిపడ్డారు. ఇమ్రాన్ దీనిపై కనీస స్పందన కూడా తెలియజేయకపోవడంతోనే ఆ దేశం తప్పు ఎంత ఉందొ అర్ధం అవుతుందని అన్నారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నామన్నారు. క్రికెట్ క్లబ్ ఇఫ్ ఇండియా క్రీడా రంగానికే చెందినదే అయినా.. ముందు తమకు దేశమే ముఖ్యమన్నారు. వాళ్ల దేశం వైపు ఏ తప్పు లేకపోతే ఇమ్రాన్ ఖాన్ ఇంత వరకు ఎందుకు మాట్లాడలేదని సురేశ్ ప్రశ్నించారు. త్వరలో జరగనున్న ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలని ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. 2019 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న దాయాదుల మధ్య పోరు జరగాల్సి ఉంది. బహుశా పుల్వామా ఘటన ఇరు దేశాల మధ్య మరింత అఘాదం సృస్టించనుందా.. లేక పాక్ ప్రపంచ పటం నుండి మాయమవనుందా..!!

గతంలో అగ్రరాజ్యంపై దాడి జరిగిన కొద్దీ సమయంలోనే దానికి సంబందించిన దేశంపై దాడికి దిగి, ముష్కరులను తుదముట్టించింది.. మరి భారత్ మాత్రం అలాంటివి ఎన్ని దెబ్బలు తిన్నా .. మిన్నకుంటుంది.. దీనికి కారణం చేవలేక.. లేక అక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారా.. ! అంటూ ఈ ఘటన అనంతరం పలువురిలో సందేహాలు మొలకెత్తుతున్నాయి. వీటికి ప్రస్తుత ప్రభుత్వం సమాధానం చెప్పగలదా! లేని పక్షంలో ఇది కూడా ఒక వెనకడుగుగా బీజేపీ వచ్చే ఎన్నికలలో ఓటమి ఖాయం అని చెప్పేయొచ్చని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పేర్కొంటున్నారు.

Related posts