telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ పై .. చార్జీల రద్దు .. : ఆర్బీఐ

RBI

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2020 నుంచి నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలు రద్దు చేయాలని నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతాదారులు చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావదేవీలను ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులకు అసాధారణ చెల్లింపుల అనుభవాన్ని కల్పించేందుకు సేవింగ్స్ బ్యాంకు నుంచి ఖాతాదారుల నుంచి నెప్ట్ ఛార్జీలు వసూలు చేయరాదని నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. 2020 జనవరి నుంచి వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశిస్తున్నాం అని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. డిజటల్ / కార్డు చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతుల కోసం యాక్సెప్టెన్స్ డెవలప్ మెంట్ ఫండ్‌ను 2020 జనవరి 01 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది.

డీమానిటైజేషన్ జరిగి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రూ. 10 వేలు విలువ వరకు నెఫ్ట్ లావాదేవీలపై రూ. 2 ఛార్జీని, అదనంగా జీఎస్టీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. రూ. 2 లక్షల పైన జరిపే లావాదేవీలపై ఎస్‌బీఐ రూ. 20 ఛార్జీని, దీనిపై జీఎస్టీని వసూలు చేస్తోంది. 2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు జరిగిన నగదు రహిత రిటైల్ చెల్లింపుల్లో 96 శాతం డిజిటల్‌వే ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో నెఫ్ట్ ద్వారా రూ. 252 కోట్ల లావాదేవీలు, యూపీఐ ద్వారా రూ. 874 కోట్ల లావాదేవీలు జరిగాయి. బ్యాంకుల మధ్య ఆన్ లైన్ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్బీఐ నిర్వహిస్తుంది.

Related posts