telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిజామాబాద్‌ లోక్‌సభ పోలింగ్‌ వేళల్లో మార్పు ఉండదు: రజత్‌కుమార్‌

Rajat Kumar Lok Sabha Elections

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని రజత్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ సహా అన్ని లోక్‌సభ స్థానాలకు ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాలు చేరినట్లు చెప్పారు. ఓట ర్ల జాబితాలో కొత్తగా 20 లక్షల మందికిపైగా ఓటర్లు చేరారని, వారిలో 80% మందికి ఇప్పటికే ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు.

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో సమావేశమై సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. నిజామాబాద్‌ ఎన్నికలను సవాలుగా స్వీకరించి అన్ని జాగ్రత్తలతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నిజామాబాద్‌ స్థానానికి పోలింగ్‌ వేళల్లో మార్పు ఉండదని, అభ్యర్థులు ఎందరున్నా సమయం సరిపోతుందని స్పష్టం చేశారు.

అక్కడి పోలింగ్‌ కేంద్రాల్లో ‘ఎల్‌’ఆకృతిలో 12 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 1,788 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. 27,185 బ్యాలెట్‌ యూనిట్లు, 3,530 కంట్రోల్‌ యూనిట్లు, 3,651 వీవీప్యాట్‌లను తరలించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలతో పని చేయని యంత్రాలను మార్చడానికి రెట్టిం పు సంఖ్యలో కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లను అందుబాటులో ఉంచామన్నారు.

Related posts