• Home
  • వార్తలు
  • అవినీతి తిమింగలాల పై..కేంద్రం కేసు నమోదు చేయలేదు: ఆర్బీఐ మాజీ గవర్నర్
రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

అవినీతి తిమింగలాల పై..కేంద్రం కేసు నమోదు చేయలేదు: ఆర్బీఐ మాజీ గవర్నర్

No case filed corruption: Ex-governor of RBI

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణాలు ఎగవేసి తప్పించుకుంటున్న పెద్ద తిమింగలాల గురించి ప్రధాని కార్యాలయానికి తెలియజేసినా కేసులు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. కొందరు ప్రముఖుల మోసాల తీరును వివరిస్తూ ఓ జాబితాను ప్రధాని కార్యాలయానికి తాను గవర్నర్ గా వున్న సమయంలో పంపానని, అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజన్ ఆరోపించారు. భాజపా నేత మురళీ మనోహర్‌ జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘానికి సమర్పించిన నివేదికలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2016, సెప్టెంబరు వరకు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురాం రాజన్ పని చేశారు.

బ్యాంకులను మోసం చేసే కేసులను ప్రారంభంలోనే గుర్తించేందుకు నేను రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు మోసాల గుర్తింపు విభాగాన్ని ఏర్పాటు చేశాను. ప్రధాని కార్యాలయానికి పెద్ద స్థాయి కేసుల జాబితాను పంపించాను. కనీసం ఒకరిద్దరిపైన అయినా కేసు నమోదు చేసేందుకు సమన్వయంగా పని చేద్దామని విజ్ఞప్తి చేశాను. అయినా ఈ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించలేదు. వాస్తవానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన వ్యవహారమిది.’’ అని రఘురామరాజన్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ఒక్క అవినీతిపరుడిపై అయినా ఈ వ్యవస్థ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్కరిపైనైనా కేసు నమోదు చేయలేకపోయిందని రాజన్‌ చెప్పారు.

Related posts

భారత్ బంద్ లో ధోని… ఈ ఫోటో నిజమే.. స్పష్టత ఇచ్చిన సన్నిహితులు

nagaraj chanti

రూటు మార్చిన నితీష్ !

admin

ట్రంప్, కిమ్ చర్చలకు ముహూర్తం ?

admin

Leave a Comment