telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తాగిన మత్తులో కవల సోదరిని పొడిచేసిన సోదరి… ఇంకేముంది…!

NJ

న్యూజెర్సీకి చెందిన అమాండా రామిరెజ్, తన సోదరి, మరో స్నేహితురాలితో కలిసి జూన్ 22 రాత్రి పార్టీ చేసుకుంది. ఆ సమయంలో బాగా మద్యం సేవించిన అక్కచెల్లెళ్ల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలయింది. అది వారు ఇంటికి చేరుకునేసరికి మరీ పెద్దదయింది. దాంతో ఏం చేస్తుందో తెలియని మైకంలో అమాండా.. దగ్గరలోని కత్తి తీసుకొని తన సోదరిని గుండెల్లో పొడి చేసింది. “అమాండా.. నువ్వు నన్ను పొడిచేశావ్’ అంటూ కిందపడిపోయిన ఆమె సోదరి అన్నారు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో అమాండాపై సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదయింది. ఈ కేసుపై విచారణ సమయంలో తప్పించుకోవడానికి అమాండా కట్టుకథలు అల్లడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత తను చేసిన నేరాన్ని అంగీకరించి క్షమించమని వేడుకుంది, మరణించిన సోదరి అన్నాకు, వారి కుటుంబానికి కన్నీటితో క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్ని గుర్తు చేసిన కోర్టు తన సోదరి మరణం అమాండాపై చాలా ప్రభావం చూపిందని, జీవితంలో మరోసారి ఆమె అలాంటి తప్పు చేస్తుందని తాము భావించడం లేదని పేర్కొంది. కానీ తప్పించుకోవడానికి అమాండా చేసిన ప్రయత్నాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆమెకు 6 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అమాండా రెండేళ్ల కుమార్తెను, మరణించిన అన్నా ముగ్గురు పిల్లలను వారి కుటుంబమే చూసుకుంటోంది.

Related posts