telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీఎఫ్‌ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ పింఛను: కవిత

MP Kavitha comments BBP Govt.

పీఎఫ్‌ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ పింఛను అందేలా ఏర్పాటు చేస్తున్నామని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ బీడీ కార్మికుల గురించి గతంలో ఎవరైనా పార్లమెంటులో ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్లను పెంచామని, వరుస ఎన్నికల దృష్ట్యా మే 1 నుంచి అందరికీ పెంచిన పింఛను అందుతుందని కవిత చెప్పారు.

దేశంలో వ్యవసాయానికి ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వట్లేదని ఆమె చెప్పారు. కేవలం తెలంగాణలోనే నిరంతర విద్యుత్తు సరఫరాసాధ్యమైందని తెలిపారు. దేశం మొత్తం ఈ పరిస్థితి రావాలంటే తన ఒక్క స్థానమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రెండేళ్లలో అన్ని గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టడం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఏ ఒక్కరూ ఇంటి కోసం దరఖాస్తు చేసుకొనే పరిస్థితి ఉండకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Related posts