telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈవీఎంలతోనే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు: ఉమేష్‌సిన్హా

OU students wrote letter to EC

నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్‌సిన్హా తెలిపారు. అభ్యర్థులు భారీగా ఉన్నప్పుడు ఈవీఎం, వీవీప్యాట్‌లు వాడటం ఇదే తొలిసారని తెలిపారు. ఈవీఎంలను మొదటిసారి హైదరాబాద్‌లోనే తయారు చేశారని.. ఎక్కువమంది అభ్యర్థులకు ఈవీఎంలతో పోలింగ్ జరపటం కూడా ఇక్కడే చరిత్రగా నిలుస్తుందన్నారు.

ఇప్పటి వరకు గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించినట్లు తెలిపిన ఉమేష్‌సిన్హా మొదటిసారి నిజామాబాద్‌లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. 25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2 వేల కంట్రోల్ యూనిట్లు అవసరమన్నారు. రేపు సాయంత్రంలోగా ఈవీఎంలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రేపట్నుంచి నిజామాబాద్‌లో 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు.

Related posts