telugu navyamedia
telugu cinema news

నీవెవరు?….

virikanne bhama poetry corner
పాల కడలిలో పుట్టిన
అమృతవల్లివా!
సౌర కుటుంబాన వెలిగే
పాలవెల్లివా!
చిరు దరహాసపు దొరసానివా!
దేవలోకపు అప్సరసవా!
పరువాల తొలిపొద్దువా!
నను వలచి వచ్చిన 
అతిలోకసుందరివా!!
వలపుల హరివిల్లువా!
ప్రేమ పొదరిల్లువా!
తొలకరి వానజల్లువా!
విరిసిన మరు మల్లెవా!
పున్నమి నాటి నిండుపండు  
 వెన్నెల జాబిలమ్మవా!
నా మనసు దోచిన
కలల రాకుమారివా!
ఎవరు ? నీవెవరు?
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts

నన్ను నీవు!!

vimala p

‘మెగాస్టార్ ది లెజెండ్ బుక్’ లాంచ్ లో చరణ్ ఎమోషనల్ స్పీచ్

vimala p

దీపికా, రణ్‌వీర్ పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం

vimala p