telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామ్ సినిమాలో మరో హీరోయిన్…

తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో, యంగ్ హీరో రామ్‌ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని తెలిసింది. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోందని అంటున్నారు. దర్శకుడు లింగుస్వామి ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఇక రామ్ ఈ సంక్రాంతికి ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అని సినీ వర్గాల్లో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో మొదట నుండి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా చేయనుందని టాక్ నడుస్తోంది. ఇక రెండో హీరోయిన్ గా రెండో హీరోయిన్ గా నివేత పేతురేజ్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే నివేత ఇటీవలే రామ్ ‘రెడ్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి పూర్తయి.. ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది. ఇదిలా ఉంటే కృతి ఇటీవల తన తొలి సినిమా ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద కాసుల ఉప్పెన తెప్పించారు. తన తొలి చిత్రంతోనే కృతి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నారు. ప్రస్తుతం కృతి నాచురల్ స్టార్ నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్‌లో నటిస్తున్నారు.

Related posts