telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమ్మ బయోపిక్ ను ఎవరు తీసినా అది సినిమానే… మేము చేసేది మాత్రం ఆమె జీవితం : నిత్యామీనన్

Nitya

పురుచ్చితలైవి, దివంగత సీఎం జయలలిత బయోపిక్‌ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జయ ఫస్ట్‌లుక్‌ను జయలలిత వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. జయ కట్టుబొట్టులో నిత్యా మీనన్ ఆకర్షించింది మేకప్ కళాకారులు నైపుణ్యంతో నిత్యను జయలోకి పరకాయ ప్రవేశం చేయించారని అభిమానులు వర్ణించారు. తాజాగా ఈ సినిమాపై కంగనా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. “ఎంత మంది అమ్మ బయోపిక్ ను తీసినా కూడా అది సినిమానే అవుతుంది. కాని మేము చేసేది మాత్రం ఆమె జీవితాన్ని చూపిస్తుంది. జయలలిత బయోపిక్స్ అన్నింటిలో మా సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను చేస్తున్న బయోపిక్ దర్శకుడు జయలలిత గారికి అత్యంత ఆప్తుడు. అమ్మ జీవితాన్ని చాలా దగ్గరగా చూశాడు. కనుక ఆమె జీవితాన్ని మా సినిమా ద్వారానే పూర్తిగా ఆవిష్కరించే అవకాశం ఉంటుంది” అని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. మరో వైపు రనౌత్ కూడా జయలలిత జీవిత కథతో తలైవి అనే సినిమా చేస్తుంది. అలాగే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో జయలలిత జీవిత కథతో ఓ వెబ్ సిరీస్ కూడా వస్తుంది. ఇలా మూడు సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

Related posts