telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నితిన్ పెళ్లా.. డెస్టినేషన్ వెడ్డింగా …

nitin bhishma movie teaser

ఇటీవల 36 ఏళ్ళ నితిన్ పెళ్లికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. నితిన్ ప్రేమ వివాహం చేసుకోనున్నాడని, డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకగా నితిన్ వివాహం ఉంటుందని ప్రచారం చేశారు. అయితే తాజాగా నితిన్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో నితిన్ వివాహం చేసుకోనున్నాడని అంటున్నారు.

14,15 తేదీలలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్టు టాక్. కేవలం 500 మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించాలని నితిన్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. అయితే నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని కాగా, ఆమె లండన్‌లో ఎంబీఏ చేసిందట. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిరివురు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది.

Related posts