telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీలోని కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు: నితిన్ గడ్కరీ

nitish gadkari to hyderabad today

దేశ రాజధాని ఢిల్లీలోని కాలుష్యంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ 59వ కన్వెన్షన్ లో గడ్కరీ మాట్లాడుతూ మన దేశంలో ఆటోమొబైల్ సెక్టార్ విలువ రూ. 4.50 లక్షల కోట్లుగా ఉందని గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో, కాలుష్యం వెదజల్లని ఇంధనం దిశగా వాహన తయారీ పరిశ్రమ అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు.

వాతావరణ కాలుష్యానికి కేవలం వాహనాలను మాత్రమే నిందించలేమని అన్నారు. అయితే కాలుష్య కారకాల్లో వీటి భాగస్వామ్యం కూడా ఉందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ దేశ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు.

Related posts