telugu navyamedia
రాజకీయ వార్తలు

ఖాదీని మనం అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది: నితిన్‌ గడ్కరీ

ఖాదీని మనం అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి కల్పనపై ఆయన మాట్లాడారు. ఖాదీని మనం అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఖాదీ పరిశ్రమలు మరింత ఉపాధి సామర్థ్యాన్ని సృష్టించబోతున్నాయన్నారు.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు వెనుకబడిన ప్రాంతాల్లో గరిష్ట ఉపాధిని కల్పిస్తాయన్నారు. ఖాదీని ప్రోత్సహించడం గ్రామీణ పరిశ్రమలకు మంచి ప్రోత్సహకంగా ఉంటుందన్నారు. గ్రామీణ కూలీలకు ఇది గొప్ప అవకాశంగా మారుతుందన్నారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్నవారికి ఖాధీ గొప్ప విజయవకాశంగా మారనుందన్నారు.

Related posts