telugu navyamedia
సినిమా వార్తలు

విదేశీయుడి కౌగిలిలో నిత్యామీనన్… అతడెవరంటే…!?

Nityamenan

తన అందం, అభినయంతో టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో బాగానే అభిమానులను సంపాదించుకుంది నిత్యామీనన్. అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. తాజాగా నిత్యామీనన్ ఓ విదేశీయుడిని కౌగిలించుకున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దానికి ఫ్రెండ్స్, లవ్, హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎవరా ? అనే సందేహం కలిగింది అందరిలో. అయితే ఆ అబ్బాయి నిత్య బాయ్ ఫ్రెండ్ అనుకున్నారు కొందరు. దీంతో నిత్యా మీనన్ స్పందించి అతడి పేరు ఓలివర్… నా లిటిల్ బ్రదర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

నిత్యా అతడిని లిటిల్ బ్రదర్ అనడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే ఓలీవర్ వయసు 18 సంవత్సరాలేనట. అంతేకాదు అతను హాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడట. ఇతను నిత్యామీనన్ కు “వన్ నెస్ యూనివర్సిటీ” అనే ఆధ్యాత్మిక సంస్థ వల్ల పరిచయం అయ్యాడు. నిత్యామీనన్ కు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ప్రపంచ మానవులంతా ఒక్కటే అని బోధించే ఈ “వన్ నెస్ యూనివర్సిటీ” సమావేశాలు, కార్యక్రమాలకు అప్పుడప్పుడు నిత్య కూడా హాజరవుతుంటుంది. అలా అక్కడ ఆమె కొందరు విదేశీయులతో పరిచయం ఏర్పడింది. అందులో ఒకడే ఓలీవర్. దీంతో నిత్యామీనన్ అభిమానుల సందేహం క్లియర్ అయ్యింది.

Related posts