telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రీమేక్ లో నటించడానికి భయంగా ఉంది : నితిన్

Nithin

`శ్రీనివాస కల్యాణం` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన `భీష్మ` సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక, బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `అంధాదున్` రీమేక్‌లో కూడా నితిన్ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నితిన్ కన్ఫామ్ చేశాడు. “ప్రస్తుతం `అంధాదున్` రీమేక్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు నేటివిటీకి తగినట్టు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నాం. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. ఈ రీమేక్‌లో నటించడానికి కొంచెం భయంగా ఉంది. `అంధాదున్`లో హీరోగా నటించిన ఆయుష్మాన్‌కు జాతీయ అవార్డు వచ్చింది. అదే నాకు భయం కలిగిస్తోంది” అని నితిన్ చెప్పాడు.

Related posts