telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న నితిన్ భీష్మ : ఫస్ట్ వీక్ రూ. 50 కోట్లు

bheeshma

భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. గత శుక్రవారం ఫిబ్రవరి 21 న విడుదలైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో నితిన్ కెరియర్‌లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు ఆరున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.10 కోట్లు.. నాలుగు రోజుల్లో రూ. 16.71 కోట్ల షేర్ రాబట్టింది. ఇక తొలివారం ముగిసేనాటికి ఆక్యుపెన్సీ పెంచుకుని వరల్డ్ వైడ్ రూ.50 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమా రూ. 23 కోట్లకు మార్కెట్ చేయగా.. తొలి ఐదురోజుల్లోనే ఖర్చుపెట్టిన మొత్తం వచ్చేసింది. దీంతో ఫుల్ ఖుషీలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగగా.. వైజాగ్‌లో 29న ‘భీష్మ’ విజయోత్సవ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు దక్కడంతో విజయోత్సవ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారనే ప్రచారం నడుస్తోంది. 

Related posts