telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

దీపావళికి .. బ్రహ్మాండమైన కార్ల కంపెనీల ఆఫర్లు..

nissan offers on depavali festival

పండుగ నాడు ఇంటికి కొత్త వస్తువు లేదా వాహనం లాంటివి తెచ్చే ఆలోచన లో ఉంటారు. వరుసగా దసరా, దీపావళి లాంటి పెద్ద పండుగలకు కొత్త వెహికల్ పై బ్రహ్మాండమైన ఆఫర్లతో ఆయా సంస్థలు ఊరిస్తున్నాయి. అందుకే ఈ పెద్ద పండుగలకు మోటార్ కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తారు. ఇప్పటికే వోక్స్ వాగన్ తమ వెహికల్స్ మీద భారీ డిస్కౌంట్స్ ఇవ్వగా నిస్సాన్ కంపెనీ కూడా దీవాళి ఆఫర్ కింద బంపర్ ఆఫర్ ఇస్తుంది. దీవాళి కానుకగా నిస్సాన్ అన్ని వెహికల్స్ మీద మోడల్ ను బట్టి భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. అధికంగా 94,000 వరకు నిస్సాన్ కార్ల మీద ధర తగ్గించారని తెలుస్తుంది.

నిస్సాన్ మైక్రా మీద 51,000 రూపాయలు తగ్గగా.. నిస్సాన్ సన్నీ, కిక్స్ వెహికల్స్ కు పండుగ ఆఫర్లు అన్ని కలిపి దాదాపు 90,000 ల దాకా తగ్గింపు ధర ప్రకటించారు. దీపావళి సేల్స్ బాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా భారీ ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రత్యేకమైన అభిరుచి గల వారు మాత్రమే కొనే నిస్సాన్ తమ కస్టమర్స్ కు ఇప్పుడు పండుగ ఆఫర్లతో స్పెషల్ సర్ ప్రైజ్ చేస్తుంది. కేవలం నిస్సాన్ మాత్రమే కాదు అన్ని మోటార్ కంపెనీలు ఈ దసరా, దీవాళికి ప్రత్యేకమైన ఆఫర్లతో కస్టమర్స్ కు మంచి అవకాశం ఇస్తున్నారు. మరి ఈ ఆఫర్లి సేల్స్ మీద ఏమాత్రం ప్రభావితం చూపిస్తాయో చూడాలి.

Related posts