telugu navyamedia
రాజకీయ వార్తలు

బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మల.. ముఖ్యాంశాలు ఇవే!

Nirmala seetharaman budget

పార్ల‌మెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మ‌హిళా ఆర్థిక మంత్రిగా రెండ‌వ సారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశపెట్ట‌డం విశేషం. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో.. రెట్టింపు ఉత్సాహాంతో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఆశించినంత ఉపాధి దొరుకుందని, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, మైనార్టీలకు, మహిళలకు, ఎస్సీఎస్టీల ఆశలను నెరవేర్చే విధంగాబడ్జెట్ ఉండబోతోందని నిర్మల చెప్పారు.

దేశ ఆర్థిక విధానంపై ప్ర‌జ‌లు విశ్వాసం ఉంచార‌ని మంత్రి చెప్పారు. ప్ర‌జ‌లు, ఉద్యోగులు ల‌బ్ధి పొందాల‌ని, త‌మ ఆశ‌యాల‌ను తీర్చుకోవాల‌న్నారు. ప్ర‌భుత్వ విధానంలో మార్పు తీసుకువ‌చ్చామ‌ని, మూలాలు బ‌లంగా మారాయ‌ని, స్థూల ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిర‌బ‌డింద‌న్నారు. జీఎస్టీని చ‌రిత్రాత్మ‌క ప‌ద్ధ‌తిలో అమ‌లు చేశామ‌న్నారు.

తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
మూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమం

ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్‌ లక్ష్యం
రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు
ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం
ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన
యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వం ప్రాధమ్యాలు
సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు
నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు
కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు వెలుతుంది.
జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొంది
చెక్‌పోస్టుల విధానానికి చెట్టిపెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది
జీఎస్టీ అమలు తరువాత సామాన్యులకు నెలవారి ఖర్చు 4శాతం ఆదా

Related posts