telugu navyamedia
రాజకీయ వార్తలు

కుల రాజకీయాల్లో చిక్కుకుని ఏపీ కష్టాలు: నిర్మలాసీతారామన్

Nirmala seetharaman

కుల రాజకీయాల్లో చిక్కుకుని ఏపీ కష్టాలు పడుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ ఏపీ శాఖ ఏర్పాటు చేసిన జనసంవాద్ ర్యాలీని ఉద్దేశించి ఢిల్లీ నుంచి నిర్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలను రద్దు చేయడంపై ఆమె స్పందించారు. ఏడీబీలాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తీసుకుని చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాల అమలులో ఇబ్బంది కలిగిస్తే అవి పూర్తికావడం చాలా కష్టమన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2.70 చొప్పున యూనిట్ విద్యుత్ కొంటున్న ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి రూ. 9 వసూలు చేస్తున్నట్టు తనకు తెలిసిందన్నారు. లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌లోకి అడుగుపెట్టిన ఇలాంటి సమయంలో రూ.9తో యూనిట్ విద్యుత్ కొని వ్యాపారాలు నడపడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఆర్థిక సమస్యల పరిష్కారానికే ఆత్మనిర్భర్ ప్యాకేజీలో రూ.90 వేల కోట్లు ప్రకటించినట్టు చెప్పారు. మత్స్య సంపద యోజన కింద రూ. 20 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు.కోవిడ్‌పై పోరుకు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.8,025 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు.

Related posts