telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఛార్జీలు లేకుండా ఏ ఏటీఎంలోనైనా నగదు తీసుకోవచ్చు: నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్యాంకుల్లో ఇకపై కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

బ్యాంకు ఖాతాదారులు అన్ని ఏటీఎంల్లో డబ్బు తీసుకోవచ్చని, 3 నెలల పాటు చార్జీలు లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నా ఎలాంటి రుసుం ఉండబోదని అన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మినిమమ్ బ్యాలన్స్ నిబంధన తొలగించడంతో సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించనుంది.

Related posts