telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

త్వరగా శిక్ష విధించండి.. మరో పిటిషన్ వేసిన నిర్భయ తల్లి.. ఇంకెప్పుడయ్యా..

Refusal to nirbhaya apologize

నిర్భయ తల్లి పాటియాలా హౌస్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులకు త్వరగా ఉరిశిక్షను అమలు చేయాలని నిర్భయ తల్లి కోర్టును అభ్యర్థించనున్నారు. ఈ కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరు చేసిన అభ్యర్ధనను వ్యతిరేకిస్తూ 2019 డిసెంబరులో నిర్భయ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.నిర్భయ కేసులో దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌కి త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలని బాధితురాలి తల్లి కోర్టును కోరనున్నారు.

చివరి సమీక్ష పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పాటియాలా హౌస్ కోర్టు దోషులకు వ్యతిరేకంగా డెత్ వారెంట్లు జారీ చేయడంపై మంగళవారం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో దోషులకు త్వరగా శిక్ష విధించాలని కోరుతూ బాధితురాలి తల్లి కోర్టులో విన్నవించనున్నారు. ఈ కేసులో ఒక్కరే ప్రత్యక్ష సాక్షి ఉన్నారని దోషి అయిన పవన్ గుప్తా తండ్రి వేసిన పిటిషన్ ను పాటియాలా హౌస్ కోర్టు సోమవారం కొట్టివేసింది.పారామెడిక్ విద్యార్థిని అయిన నిర్భయపై 2012 డిసెంబరు 16వతేదీ అర్దరాత్రి దక్షిణ ఢిల్లీలో బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసి తీవ్రంగా కొట్టారు. నిర్భయ డిసెంబర్ 29, 2012 న సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో మరణించింది. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు గడచినా ఇంకా దోషులకు శిక్ష అమలు చేయలేదు.

Related posts