telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

మా కూతురికి న్యాయం జరిగింది..నిర్భయ తల్లి హర్షం

Refusal to nirbhaya apologize

2012 లో ఢిల్లీలో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిండుతులను ఈ నెల  22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కోర్ట్ తీర్పు పై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళకు మా కూతురికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఆ నలుగురు దుర్మార్గులకు మరణశిక్ష అమలు చేయడం మహిళలకు మరింత ఆత్మస్థయిర్యం కలిగిస్తుందని అన్నారు.

ఈ తీర్పు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అమలు చేయడం ద్వారా దేశంలోని మహిళాశక్తి బలోపేతం అవుతుందన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని బలపరుస్తుందని ఆమె పేర్కొన్నారు.

Related posts