telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సాంకేతిక

విజయవంతంగా .. నిర్భయ్ క్షిపణి .. ప్రయోగం..

nirbhai trial grand success

రక్షణ రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని నమోదు చేసుకుంది. లాంగ్ రేంజ్ నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నిర్భయ్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించగా, సూదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించింది. కేవలం 42 నిమిషాల 23 సెకన్లలో నిర్దేశిత దూరం ప్రయాణించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. నిర్భయ్ క్షిపణి రేంజ్ 1000 కిలోమీటర్లు. దీన్ని డీఆర్ డీవో తయారుచేసింది.

చివరిసారిగా 2017 నవంబర్ 7న ప్రయోగించారు. ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులతో మరింత ఆధునికీకరించారు. ఇది సబ్ సోనిక్ వర్గానికి చెందిన క్రూయిజ్ క్షిపణి. సుమారు 300 కిలోల పేలుడు పదార్థాలను తనతో తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. టర్బో జెట్/టర్బో ఫ్యాన్ ఇంజిన్ తో పనిచేసే నిర్భయ్ లో అత్యాధునిక ‘ఇనెర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ’ పొందుపరిచారు. ఇందులో ఉండే కంప్యూటర్ పలు సెన్సర్ల ఆధారంగా మిస్సైల్ ను చివరి నిమిషం వరకు సరైన పొజిషన్ లో నిలుపుతుంది. తద్వారా మరింత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు.

Related posts