telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

చైనీస్ న్యూడిల్స్ తిని 9 మంది మృతి..

ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో జనాలు ఎం తింటున్నారో, ఎప్పుడిది తింటున్నారో అనే ఆలోచన చేసే సమయం కూడా లేకుండా పోయింది. జంక్ ఫుడ్స్ ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి జంక్ ఫుడ్ లను తినకూడదు అని నిపుణులు చెబుతూనే వున్న జనాలు మాత్రం ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలకు ఇలా ఏకంగా ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. నార్త్‌ ఈస్ట్రన్‌ చైనీస్ ప్రాంతంలోని హెయిలోంగ్ ‌జియాంగ్‌లో అక్టోబర్ 5న ఓ కుటుంబంలో 12 మంది బంధువులు కలుసుకున్నారు. అందులో 9 మంది మొక్కజొన్న పిండితో చేసిన సున్‌ టంగ్ జి అనే ప్రత్యేక న్యూడిల్‌ డిష్‌ని తిన్నారు. దాన్ని ఏడాదిగా ఫ్రిజ్‌లో ఉంచగా.. మార్నింగ్ ఫుడ్‌ మీటింగ్‌లో తిన్నారు. వెంటనే ఆ తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. దీనితో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడ తీవ్ర కలకలం రేపింది. దీనిపై చైనీస్ హెల్త్‌ కమిషన్ జాతీయ హెచ్చరికను కూడా చేసింది.

Related posts