telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాలంటీర్లకు షాకిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ…

Nimmagadda ramesh

ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లోకల్‌ ఎలక్షన్స్‌పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. అటు మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం డబ్బు పంపిణీ చేస్తున్నాయి పార్టీలు.  ఇది ఇలా ఉండగా….హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో వార్డు వాలంటీర్ల పై ఆంక్షలు అమలు దిశగా ఎస్ఈసీ నిమ్మగడ్డ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం చట్ట విరుద్ధమని ఎస్ఈసీ హెచ్చరికలు జారీ చేశారు. వార్డ్ వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేరం కింద శిక్షా అర్హులని స్పష్టం చేసారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఏమైనా సమస్యలు ఉంటే..ఎన్నికల కమిషన్ కాల్ సెంటర్ , జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ఫిర్యాదు చేయాలని ఎస్ఈసీ సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వాలంటీర్లు లబ్దిదారులతో మాట్లాడకూడదని ఆదేశించిన ఎస్ఈసీ.. వాలంటీర్లకు సంబంధించిన ఫిర్యాదుల పై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.

Related posts