సినిమా వార్తలు

చివరి దశలో నిఖిల్ “ముద్ర”

nikhil-siddharth

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ “హ్యాపీ డేస్”తో పరిచయమై స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అయితే ఆయన నటించిన చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి. తాజాగా నిఖిల్ “ముద్ర” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగుతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, నవంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్, లావణ్య త్రిపాఠి ఉన్నారు.

Related posts

జయకు నివాళులర్పించిన టాలీవుడ్ ప్రముఖులు

vimala t

‘నీవెవ‌రో’ మాకు మెమొర‌బుల్ మూవీగా నిలిచిపోతుంది – కోన వెంక‌ట్‌

chandra sekkhar

ఏదో తప్పు జరుగుతోంది… నందిత మళ్ళీ… !

vimala t

Leave a Comment