telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ ను “పావలా కళ్యాణ్” అంటూ హీరోయిన్ ట్వీట్… ఫ్యాన్స్ ఫైర్

Nikisha-Patel

పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ తరువాత సినిమాలకు దూరమైనప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆయ‌న బ‌ర్త్‌డేని అభిమానులు వేడుకలా జ‌రుపుకున్నారు. అభిమానులు, సెలబ్రిటీలు ప‌వ‌న్‌కి సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో పవన్ ఇండియాలో టాప్ 1గా ట్రెండింగ్ అయ్యారు. ఈ క్రమంలో ప‌వ‌న్ న‌టించిన “కొమరం పులి” చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన నికీషా ప‌టేల్ త‌న కోస్టార్‌కి ట్విట్ట‌ర్ ద్వారా బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న #HappyBirthdayPawalaKalyan  #HappyBirthdayPSPK,#HappyBirthdayPawanaKalyanfromSSMBfans,#HappyBirthdayPawalaKalyan హ్యాష్ ట్యాగ్‌లను జ‌త చేసి మరీ శుభాకాంక్ష‌లు తెలిపింది. కానీ ఒక హ్యాష్ ట్యాగ్‌ లో పావ‌లా క‌ళ్యాణ్ అని త‌ప్పుగా రాయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో త‌న త‌ప్పుని తెలుసుకున్న నికీషా పాత ట్వీట్స్ డిలీట్‌ చేసి, “త‌ప్పు దిద్దుకున్నాను. ఈసారి సరిగానే ట్యాగ్ చేశా అనుకుంటున్నా. నా ట్వీట్ వ‌ల‌న ఎవ‌రైన హ‌ర్ట్ అయితే క్ష‌మించండి. హ్య‌పీ గ‌ణేషా” అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts