telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్.ఆర్.ఆర్ పై .. నైజం హక్కుల వరకు.. కళ్లుచెదిరే డీల్ అట..!

nijam rights for 80 cr to rrr movie

జక్కన ఒకపక్క ఆర్.ఆర్.ఆర్ చిత్ర నిర్మాణంలో బిజీబిజీగా ఉంటె, దానిపై వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అప్పుడే హక్కుల వరకు ఈ వార్తలు వెళ్లాయంటే, రాజమౌళి చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఒక్క బాహుబలి సినిమాల తో నేషనల్ డైరెక్టర్‌గా కాకుండా ఇంటర్నేషనల్ రేంజుకు ఎదిగిపోయాడు జక్కన. రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటే ఇండియన్ సినిమా ప్రియులే కాకుండా, విదేశాలు ముఖ్యంగా అమెరికా, చైనా, అరబ్ దేశాల సినిమా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ క్రెడిట్ సొంతం చేసుకున్న రాజమౌళికి ముందుగా మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. వచ్చే యేడాదిలో విడుదలవుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి అప్పుడే వ్యాపార సంబంధిత లావాదేవీలు ప్రారంభం అవ్వడంతో పాటు కొన్ని ఏరియాలకు డీల్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను దుబాయ్‌కు చెందిన ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ. 72 కోట్లకు సొంతం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే నైజాం ఏరియాకు అదిరిపోయే ఫార్ వచ్చినట్టు టాక్‌.

నైజాం ఏరియాకు ఆర్ ఆర్ ఆర్ రేంజ్ సినిమా కొనాలంటే అది దిల్ రాజు, ఏసియన్ సునీల్ లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. వీరిద్దరు ఈ సినిమా రైట్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. నైజాం హక్కుల కోసం వీళల్లో ఒకరు రూ.70 కోట్లు కోడ్ చేస్తే.. మరొకరు రూ.80 కోట్లు కోడ్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్క నైజాంలో రూ.80 కోట్ల డీల్ అంటే వినడానికే కళ్లు చెదిరిపోయేలా ఉంది. ఇటీవల మహర్షి సినిమాకు తెలంగాణలో రేట్లు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ లెక్కన జక్కన సినిమా యూనిట్ తో పాటు దిల్ రాజు లాంటి వాళ్లకు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో రేట్లు పెంచుకునే వెసులు బాటు ఉంటే సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు ఖాయమే!!

Related posts