telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కలర్‌ ఫోటోకి మెగా డాటర్‌ నిహారిక “నో” చెప్పింది

ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సినిమాల్లో కలర్ ఫోటో సినిమా కూడా ఒకటి. థియేటర్ లు తెరుచుకోకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసారు. ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. సినిమాలో సుహాస్ , చాందిని హీరో హీరోయిన్ లుగా నటించారు. సునీల్ మరియు వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించారు. లవ్ ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు మొదట మెగా డాటర్ నిహారికను సంప్రదించినట్టు తెలిపారు. అయితే సొంత కారణాల వల్ల నిహారిక ఈ సినిమాకు నో చెప్పినట్టు తెలిపాడు. దాంతో చాందిని సంప్రదించమన్నారు. సినిమాలో చాందిని తన పాత్రలో జీవించిందని అన్నారు. ఇదిలా ఉండగా మెగా డాటర్ నిహారిక గుంటూరుకు చెందిన చైతన్య ను పెళ్లాడనుంది. డిసెంబర్ 9న వీరి వివాహం రాయ్ పూర్ లోని ప్రముఖ హోటల్ లో జరగనుంది.

Related posts