telugu navyamedia
సినిమా వార్తలు

హిట్ సినిమాను వదులుకున్న నిహారిక…!?

Niharika

ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌, పెర్లిన్‌ బెసానియాప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “సూర్యకాంతం” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘‘కొన్ని సినిమాలు చేతివరకూ వచ్చి వేరొకరికి వెళ్లిపోతుంటాయి. తీరా ఆ సినిమా రిలీజై సూపర్ హిట్ అయ్యాక ‘అయ్యో! ఈ సినిమా నేను చేసుంటే బాగుండేది’ అని అనిపిస్తుంది. ‘నేను శైలజ’ సినిమా రూపంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నన్ను సంప్రదించారు. కానీ ఆ సమయంలో సినిమాల్లో నటించేందుకు గాను ఇంట్లోవారిని ఒప్పించే పనిలో ఉన్నాను. అయితే నా కోసం ఆ చిత్ర దర్శకనిర్మాతలు నెల రోజుల పాటు వెయిట్ చేసి చివరకు కీర్తిసురేష్‌ని తీసుకున్నారు. విడుదలయ్యాక ఆ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో మీకు తెలుసు’’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

Related posts