telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫ్లాష్ : తెలంగాణలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ : ఇవి మాత్రమే ఓపెన్

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి.  గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 5926 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 18 మంది కరోనాతో మృతి చెందారు. అయితే
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి నుండి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. నేటి నుంచి మే 1 వరకు కర్ఫ్యూ కొనసాగునుంది. అత్యవసర సర్వీసులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కర్ఫ్యూ నుంచి మీడియా, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సర్వీసులు, మెడికల్ షాపులకు మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. ఇక నైట్ కర్ఫ్యూ కారణంగా బార్లు, క్లబ్బులు, వైన్స్, షాపింగ్ మాల్స్ రాత్రి పూట మూతపడనున్నాయి. 

Related posts