telugu navyamedia
సినిమా వార్తలు

మేకప్ ఆర్టిస్ట్ తో నాగ చైతన్య హీరోయిన్ ఘాటు రొమాన్స్

NIdhi-Agarwal

“సవ్యసాచి” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ముంబై భామ నిధి అగర్వాల్. ఈ బ్యూటీ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మేకప్ ఆర్టిస్ట్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులకు మేకప్, హెయిర్ డిజైనర్ గా షాన్ పని చేస్తుంటాడు. ఇంటర్నేషనల్ వైడ్ అతడికి ఆ అరంగంలో మంచి గుర్తింపు ఉంది. కోట్లలో సంపాదించే షాన్ కి ఇండస్ట్రీలో పరిచయాలు కూడా ఎక్కువే. ఇప్పుడు నిధి కూడా అతగాడికి మంచి స్నేహితురాలట. ఆమె ఎంత క్లోజో చెప్పడానికి తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో నిధి, షాన్ బుగ్గపై ముద్దు పెడుతూ కన్పించగా, షాన్ కూడా నిధిని ముద్దుపెట్టుకున్నాడు. నిధి ఈ ఫోటోలకు ”జీఎస్ టీ రీయూనియన్” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై స్పందించిన షాక్… ”బబ్బూ.. మళ్లీ మనం చేశాం.. ఒక పగలు,ఒక రాత్రి ఎప్పటికీ గుర్తుండేలా.. నిన్ను ఎప్పటికీ పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. నువ్ నాకెంతో ప్రత్యేకమైన అమ్మాయివి” అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఇతగాడికి నిధి మాత్రమే కాకుండా జాక్విలిన్ ఫెర్నాండెజ్, సోఫీ చౌదరి లాంటి చాలా మంది సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.

Related posts