telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేఎల్ రాహుల్ తో డేటింగ్ పై స్పందించిన నిధి అగర్వాల్

nidhi agarwal counter answer to

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ రామ్ కెరీర్‌లో తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో తొలి విజయం అందుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా ‘వూట్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైయ్యే ‘ఫీటప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో పాల్గొంది నిధి అగర్వాల్. ఇందులో లక్ష్మి మంచుతో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు విషయాలను పంచుకుంది. ఇందులో నిధి భారత క్రికెటర్ కేఎల్ ‌రాహుల్‌తో డేటింగ్ గురించి స్పందించింది. రాహుల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని తెలిపింది. ర్ సందర్భంగా నిధి మాట్లాడుతూ “లండన్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా ఓడించింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. భారత క్రికెట్ జట్టును కలిసి అభినందించాను. అప్పుడే కేఎల్ రాహుల్‌ను కలిశాను. నేను, రాహుల్ మంచి స్నేహితులం. అంతకు మించి మా మధ్య ఇంకేమీ లేదు. ఆయనతో డేటింగ్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు”అని చెప్పుకొచ్చింది.

Related posts