telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్‌ స్టార్‌ సినిమాలో రామ్‌ హీరోయిన్‌..?

nidhi agarwal counter answer to

పవర్ ‌స్టార్ పవన్ ‌కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన డైరెక్టర్ క్రిష్‌తో తెరకెక్కే భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్‌ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ జోనర్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బందిపోటు, గజదొంగ, ఓం శివమ్‌.. ఇలాంటి టైటిల్స్‌ పరిశీలనలోఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ లిస్టులో అంతర్వాహిని అనే టైటిల్‌ కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తకొటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటంటే… ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాగా.. ఇప్పుడు ఆమె స్తానంలో నిధి అగర్వాల్‌ నటిస్తుందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. నిధి అగర్వాల్‌కు మంచి అవకాశాన్ని దక్కించుకున్నటే.

Related posts