telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నీదైపోయిన నా మనసు

nidaipoina na manasu poetry corner

నా ఊహల్లో నిక్షిప్తమై
నా మదిలో కొలువుతీరి
నా స్వప్నంలో అలరిస్తూ
నా మనసులో సుస్థిరమై
నీ రాక కోసం ఎదురుచూస్తూ…

నీలిగగనాన నెలరాజువై
పుష్పక విమానమెక్కి
దివినుండి భువికి వస్తున్నట్టు
నా చెంతకే వస్తున్నట్టు
నన్ను పలకరించ వస్తున్నట్టు
మనువాడుటకె వస్తున్నట్టు
పుష్పమాలతో స్వాగతించాలని
పూలదండలతో నీకేసి చూస్తూ
నన్ను ఆలింగనం చేసుకొని
నీ ప్రపంచంలోకి నన్ను ఆహ్వానిస్తావని
కోటి ఆశలతో 

-రచన: ఎస్ చిన్నికృష్ణ,
చిత్తూరు జిల్లా

Related posts