telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ

హైదరాబాద్‌లో  ఉగ్రవాదులు .. ఎన్ఐఏ అధికారుల సోదాలు!

no Indian to stay in libia warned govt
హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో ఎన్ఐఏ సోదాలతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
దీంతో స్థానిక కింగ్స్ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఉగ్రవాది బాసిత్ ఇచ్చిన సమాచారంతో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విచారణలో తాను నలుగురు యువకులకు గతంలో ఏకే 47 రైఫిల్స్‌తో పాటు కెమికల్స్‌ను అందించినట్లు బాసిత్ తెలిపాడు. 2015లో ఢిల్లీకి చెందిన ఓ ఆర్ఎస్ఎస్ నేతను హత్య చేసేందుకు బాసిత్ పన్నిన కుట్రను ఎన్ఐఏ ఛేదించింది. దీనితో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు బాసిత్ పథకం వేశాడు. అయితే ఆ కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. కశ్మీర్ వేర్పాటు వాదులతో పాటు ఐసిస్, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో బాసిత్‌కు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. బాసిత్ ఆయుధాలు ఇచ్చిన నలుగురు యువకుల కోసమే ఎన్ఐఏ హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించినట్లుగా సమాచారం.

Related posts