telugu navyamedia
సినిమా వార్తలు

నీ ప్రేమకై నేను…!

prema pakshulai poetry corner

నీ ప్రేమదీపం వెలిగించటకు
నేను చమురునై
నీ ప్రేమమందిరం నిర్మించుటకు
నేను పునాదినై
నీ గుండెలో కొలువుండుటకు
నేను స్పందనై
నీ ప్రేమకావ్యాన్ని రచించుటకు
నేను ప్రేరణనై
నీ ప్రేమప్రతిమను మలచుటకు
నేను ఉలినై
నీ ప్రేమనిత్యం జీవించుటకు
నేను శ్వాసనై
కలకాలం నిలిచిపోనా ప్రియా..!

-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి

Related posts