telugu navyamedia
సినిమా వార్తలు

నీ చూపులో…

sakhi hrudayeswari poetry corner

గడియారం గంట కొట్టగానే …..
ఉలిక్కిపడుతున్నా …….
నీ ధ్యాస నుండి మనసు మరల్చుతున్నా…….
గుడి గంట కొట్టగానే ……
వేగిరపడుతున్న నీ దర్శనం కోసం…..
దైవం నుండి చూపు మరల్చుతున్నా…..
నీ చూపుల బాణం తగలగానే ……
గుండె కొట్టుకుంటున్నది నీ జత లో
నీ నుండి చూపు మరల్చుతున్నా……
చూస్తున్నా చూస్తూనే ఉన్నా…..
కనురెప్పలు కొట్టగానే…..
కనిపించక కనుమరుగుఅయ్యావే…..
నిను మరచిపోలేకపోతున్నా…..

-జె.పద్మావతి, ఆదోని.

Related posts