telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు ఎన్నో కారణాలు: ఎన్జీటీ కమిటీ

vishakha gas leak

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) విచారణ కమిటీ పరిశీలనలో కీలక అంశాలను గుర్తించారు. ఎల్జీ పాలిమర్స్ ఎన్నో కారణాలను తన నివేదికలో ఎన్జీటీ కమిటీ ఎత్తిచూపింది. ముఖ్యంగా ఐదు కీలక తప్పిదాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.

ప్లాంట్ లోనూ, స్టోరేజి ట్యాంకు వద్ద పర్సన్ ఇన్ చార్జిల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్టంగా ఉందంటూ ఎన్జీటీ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.అత్యల్ప ఉష్ణోగ్రతల్లో స్టైరీన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజి తగినంతగా ప్లాంట్ లో అందుబాటులో లేదు. ప్లాంట్ లో ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయడంలేదు.స్టైరీన్ స్టోరేజి ట్యాంకు టాప్ లేయర్లలో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించడంలేదు. ప్లాంట్ లో రిఫ్రిజరేషన్ వ్యవస్థను 24 గంటల పాటు ఆపరేట్ చేయడంలేదని కమిటీ వెల్లడించింది.

Related posts