telugu navyamedia
సినిమా వార్తలు

“ఎన్.జి.కే” మూవీ ప్రీమియర్ షో టాక్

surya ngk movie teaser

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం “ఎన్‌.జి.కె”. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ ప్రదర్శితం కావడంతో… సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా సినిమా విశేషాలను షేర్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందొ చూద్దాము.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు సెల్వ ప్రతి ఒక్క సామాన్యుడికి ఒక మంచి సేందేశాన్ని ఇచ్చాడని చెప్పవచ్చు. దేశభక్తికి సంబందించిన సీన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తాయి, నంద గోపాల్ పాత్రలో సూర్య ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సెకండ్ హాఫ్ లో సూర్య నటన హైలెట్ చెప్పవచ్చు. మంచి జాబ్ వదిలేసి రైతుగా సెటిల్ అవ్వాలని సూర్య నందగోపాల్ పాత్రలో పరిచయమయ్యే విధానం, నంద గోపాల్ మరియు అతని స్నేహితులు పెస్టిసైడ్ (క్రిమి సంహారిణి) మాఫియా నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న అనంతరం కథ ఊహించని విధంగా పాలిటిక్స్ జానర్ లోకి మారడం ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయి. సూర్య ఒక కార్యకర్తగా పార్టీలో కొనసాగుతూ ఎదుర్కొన్న పరిణామాలు అలాగే చివరలో ప్రస్తుత మనుషుల గురించి సూర్య చెప్పే స్పీచ్ హైలెట్. సూర్యకు భార్యగా సాయి పల్లవి సింపుల్ నటనతో ఆకట్టుకుంటుంది. ఇక మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా ఒక లేడి పొలిటీషియన్ గా కీలక పాత్రలో మెప్పించింది. మొత్తానికి ఈ సినిమాతో సూర్య ఖాతాలో హిట్ పడినట్లే అంటున్నారు.

Related posts