telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : వచ్చే వారం వైల్డ్ ఎంట్రీ ఎవరంటే ?

starmaa official on bigg boss 3 telugu

బిగ్ బాస్ సీజ‌న్-3 ప్రారంభ‌మై 15 మంది కంటెస్టెంట్స్‌తో ఇప్ప‌టికే రెండు ఎలిమినేష‌న్స్ పూర్త‌య్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌గా, రెండో వారం జాఫ‌ర్‌ని ఎలిమినేట్ చేశారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 14 మంది స‌భ్యులు ఉండ‌గా… ఈ వారం నామినేష‌న్‌లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌లో నిలిచారు. రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. నాగార్జున వ్యాఖ్యాతగా ఈ రియాలిటీ షో మొదట్లో నార్మల్ గానే అనిపించినా రోజులు గడుస్తున్న కొద్దీ ఆసక్తికరంగా మారింది. ఫైనల్ గా అందరూ ఉహించనట్టుగానే మూడవ ఎలిమినేషన్ లో తమన్నా సింహాద్రికి చేదు అనుభవం తప్పలేదు. ఇక తరువాత వీరం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. నిన్న తమన్నా వెళ్లిపోవడంతో హౌజ్ లో 13 మంది కంటెస్టెంట్స్ లు ఉన్నారు. హేమ ఎలిమినేట్ కాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నా కొన్నిరోజులకే ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఆమె అతి ప్రవర్తన వల్లే హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని కంటెస్టెంట్ కామెంట్ చేశారు. వచ్చే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమారి 21 ఫెమ్ హెబ్బా పటేల్ రానున్నట్లు టాక్ వస్తోంది. అలాగే శ్రద్దా దాస్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Related posts