telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ కప్ ముగిసినా.. తేరుకోలేకపోతున్న.. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ ..

newzeland cricketer on world cup finals

ప్రపంచకప్‌ అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో అందరికి తెలిసిందే.. అవటానికి ఆటే అయినప్పటికీ, దానిపై అంతటి అంచనాలు ఉండటానికి కారణం ఆ ఆటపై ఉన్న పిచ్చిప్రేమ, అభిమానం. అందువలనే ఆఖరి పోరులో చేసిన పొరపాట్లకు ఆటగాళ్లు ఇంకా కుంగిపోతూనే ఉన్నారు. తాజా వివరాల ప్రకారం, ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత తీవ్రంగా కుంగిపోయిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. ఆ మ్యాచ్‌పై తన భావాలు బయటకు వ్యక్త పరిచాడు.

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ రోజు తన కెరీర్‌లో ‘అత్యుత్తమ-అత్యంత చెత్త రోజు’ అని పేర్కొన్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ సైతం టై అవ్వడంతో ఎక్కువ బౌండరీలు చేసిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగిన 2015 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన గప్తిల్‌ ఈ సారి విఫలమయ్యాడు. ఎక్కువ పరుగులు చేయలేదు. అయితే తన అత్యుత్తమ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. సెమీస్‌లో ధోనీని రనౌట్‌ చేసి కివీస్‌ను ఫైనల్‌ చేర్చాడు. ప్రపంచకప్‌ ఫైనల్లో మర్చిపోలేని ఓవర్‌ త్రో విసిరాడు. సూపర్‌ ఓవర్‌లో చివరి బంతికి రెండు పరుగు తీస్తూ ఔటై చరిత్రలో నిలిచాడు.

Related posts