telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వకీల్ సాబ్’ మగువా మగువా… సాంగ్ వచ్చేస్తోంది

pawan-kalyan

పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. ఇప్పటికే విడులైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి పాట వస్తోంది. ‘మగువా మగువా’ అంటూ సాగే ఈ పాటను ఈనెల 8న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తు్న్నారు. అయితే, శుక్రవారం ఈ పాట ప్రోమోను లాంచ్ చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా’ అనే లిరిక్‌ను ప్రోమోలో వినిపించారు. ఈ రెండు లైన్లు వింటుంటే ఇది మహిళ గొప్పతనాన్ని చాటే పాట అని అర్థమవుతోంది. ఇలాంటి పాట పవన్ సినిమా అందులోనూ సిద్ శ్రీరామ్ స్వరం నుంచి జాలువారితే సెన్సేషన్ కాక ఇంకేమవుతుంది.

Related posts