telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పసికందును కవర్లో కుక్కి… ఆ తల్లిదండ్రులు చేసిన పని తెలిస్తే…!

Baby

తైవాన్‌కు చెందిన ఓ యువతి మానసిక పరిస్థితి బాగాలేదు. అలాంటి అమ్మాయికి ఆన్‌లైన్లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వారి పరిచయం ప్రణయంగా మారింది. సహజీవనం చేయడం ప్రారంభించిన వీరికి అక్టోబరు 8న ఓ బిడ్డ పుట్టాడు. అయితే వారిద్దరి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీంతో బిడ్డను ఓ కవర్‌లో కుక్కి కౌషింగ్ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరుగుతున్న ఓ ప్రాంతంలో పడేశారు. కాగా కవర్‌లోని పసివాడు ఆ ప్రాంతంలో తిరుగుతున్న వీధికుక్కల కంటపడ్డాడు. రక్తపు ముద్దలా ఉన్న ఆ శిశువు బ్రతికుండగానే ఆ కుక్కలు పీక్కుతిన్నాయి. ఆ ప్రాంతంలోని మొక్కలపై శిశువు శరీరభాగాలు కనిపించడంతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఓ ఇంటర్నెట్ సెంటర్లో తలదాచుకుంటున్న ఆ శిశువు తల్లిదండ్రులను వారు అదుపులోకి తీసుకున్నారు.

Related posts