telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రికెట్ ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా బెన్ లిస్టర్…

న్యూజిలాండ్ పేసర్ బెన్ లిస్టర్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు నిలిచాడు. ఎందులో అంటే… దేశీయ ప్లంకెట్ షీల్డ్ మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు అతను మార్క్ చాప్మన్ స్థానంలో ఆక్లాండ్ జట్టులోకి వచ్చాడు. ఈడెన్ పార్క్ లో ఒటాగోతో జరిగిన ప్లంకెట్ షీల్డ్ మ్యాచ్ కోసం మొదట ఆక్లాండ్ జట్టులో చేరిన చాప్మన్ సోమవారం అనారోగ్యంతో బాధపడ్డాడు.. అలాగే అతని కోవిడ్ -19 పరీక్ష ఫలితం పెండింగ్‌లో ఉంది. న్యూజిలాండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన 26 ఏళ్ల ఆటగాడు. తన పరీక్ష ఫలితంలో నెగెటివ్ వస్తే తిరిగి జట్టులో చేరవచ్చు. కానీ నిన్నటి మ్యాచ్ లో అతని స్థానములోనికి18 ఫస్ట్ క్లాస్ ఆటలలో పాల్గొన్న లిస్టర్, చాప్మన్ వచ్చాడు. ఈ విషయాన్ని ఆక్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. అయితే కరోనా రిప్లేస్మెంట్ లో వచ్చిన మొదటి ఆటగాడిగా లిస్టర్ నిలిచాడు.

అయితే “మార్క్ చాప్మన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని మరియు కరోనా పరీక్ష చేయించుకోవలసి ఉందని ఈ రోజు వరకు నాకు తెలియదు” అని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త కరోనా నియమ నిబంధనలను ఆమోదించింది, ఇది జట్టులో ఉన్న ఆటగాళ్లకు అనారోగ్యం అనిపిస్తే లేదా వారిలో కరోనా లక్షణాలుl కనిపిస్తే వారిని భర్తీ చేయడానికి అనుమతించింది. అలాగే కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తే తిరిగి జట్టులోకి రావడానికి అనుమతించింది.

Related posts