telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గుజరాత్‌ : .. కొత్త రకం సాలీడుకు.. సచిన్ పేరుతో ..

new type of spider named as sachin

అంతులేని అభిమానం అంటే ఇదేనేమో.. స్థానికంగా ఓ పరిశోధకుడు తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌పై అభిమానాన్ని విభిన్నంగా వ్యక్తం చేశారు. తాను కనుగొన్న ఓ సాలె పురుగుకు సచిన్‌ పేరుతో నామకరణం చేసి తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ధ్రువ ప్రజాపతి అనే వ్యక్తి గుజరాత్‌ పర్యావరణ విద్య పరిశోధన(జీఈఈఆర్) సంస్థలో ‘స్పైడర్‌ టాక్సానమీ’ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల ఆయన రెండు కొత్త రకం స్పైడర్‌(సాలెపురుగు)లను కనుగొన్నారు. వాటిని ఆసియా ఎగిరే సాలీడు జాతికి చెందిన ఇండో మరెంగో, మరెంగో జాతికి చెందిన వాటిగా గుర్తించాడు.

ఆ కీటకాలకు పేర్లు పెట్టే క్రమంలో ఆయన తన అభిమాన వ్యక్తుల పేర్లు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకదానికి భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పేరును, మరోదానికి కేరళలో విద్యపై అవగాహన తీసుకువచ్చిన సెయింట్ కురియాకోస్‌ ఎలియాస్‌ చవారా పేర్లను పెట్టారు. దీని తాలూకు వివరాలు ‘ఆర్థ్రోపొడా సెలెక్టా’ అనే రష్యన్‌ జర్నల్‌లో సెప్టెంబర్‌ నెలలో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సచిన్‌ తెందుల్కర్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనపై అభిమానంతోనే కొత్తరకం పురుగుకు పేరు పెట్టాను’ అని వెల్లడించారు.

Related posts