telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

పెండ్లి పిలుపు సమాచారం కోసం .. క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయగలరు.. !

new trend in invitations of marriages

పుర్రెకోబుద్ది.. అన్నటుగా, ఇటీవల ఏ పని చేసినా అందులో సృజనాత్మకతను జోడిస్తున్నారు కొందరు. ఈ నేపథ్యంలోనే ఒక పెళ్లి పిలుపుకు వీరు పాటించిన ఆ కొత్తదనం ఏమిటో మీరు తెలుసుకోండి.. క్యూ ఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ఇప్పుడు పెండ్లి పత్రికల పైనా చేరింది (వీలైతే ఇలాంటి ప్రయోగాలు మీ జీవితంలోని ముఖ్య ఘట్టాలలో ప్రయత్నించండి; ప్రమాదభరితమైనవి వద్దులెండి, ఇలాంటి సింపుల్ థింగ్స్ ప్రయత్నించండి). నగరవ్యాప్తంగా ఇప్పుడిది కొత్త ట్రెండ్. సాధారణంగా వేడుకలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వేదిక ఎక్కడన్నది త్వరగా తెలియదు. ఇందు కోసం తమను ఆహ్వానించిన వారికి ఫోన్ చేయటం లేదా దారిన పోయే వారిని అడగాల్సి రావటం మనందరికీ అనుభవమే. అయితే వేడుకల హడావుడిలో ఉన్న వారు ఇలా కాల్స్ రిసీవ్ చేసుకోవటం కొంత ఇబ్బందికరమే. ఇక దారిన పోయే వారు సరైన చిరునామా చెబుతారా అన్నది కూడా సందేహమే కదా!

ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడు తూ వేడుక వేదిక ఎక్కడో ఈ కోడ్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. అతిథులు తమ వద్ద ఉన్న ఆహ్వాన పత్రికలోని క్యూ ఆర్ కోడ్‌ను తమ స్మార్ట్ ఫోన్‌లో స్కాన్ చేస్తే తాము ఉన్న ప్రాంతం నుంచి వేదిక వద్దకు చేరడానికి మార్గం, పట్టే సమయం అంతా గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. అంతేకాక దీనిలో వేడుక సందడి గురించి తెలియచేస్తూ రూపొందించిన వీడియో ప్రోమో సైతం ఈ కోడ్ స్కాన్ చేసు కున్న వారిని పలకరిస్తుంది. నేరుగా తమ వారు తమను ఆహ్వానిస్తూ వీడియోలో కనిపిస్తారు, ఆత్మీయతను పంచుతారు. సాధారణకార్డుతో పోలిస్తే క్యూఆర్ కోడ్‌ను జత చేసిన కార్డు కేవలం ఒక్క రూపాయి మాత్రమే అధికమని నగరంలో ఈ తరహా కార్డును ముద్రించిన వారు పేర్కొంటున్నారు.

Related posts