telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముంబయి : … బిగ్‌బాష్ టీ20 లీగుతో.. కొత్త సాంప్రదాయం ..

new trend in bigbash league

బిగ్‌బాష్ టీ20 లీగుతో క్రికెట్ లో వినూత్న సాంప్రదాయం బయలుదేరింది. మైదానంలో ఆడేవారు అభిమానులను అలరించేందుకు నిత్య నూతనంగా ఆలోచిస్తున్నారు. సాధారణంగా మ్యాచులో ఎవరు ముందు బ్యాటింగ్‌ చేయాలో నిర్ణయించేందుకు టాస్‌ వేస్తారు. సారథుల్లో ఒకరు హెడ్స్‌ లేదా టెయిల్స్‌ చెబుతారు. శనివారం మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య జరిగిన పోరులో మాత్రం బ్యాటు ఫ్లిప్‌ ద్వారా తేల్చారు. రెండు జట్ల సారథులు మాక్స్‌వెల్‌, ఆరోన్ ఫించ్‌ ఉండగా ఓ కుర్రాడు పైకి బ్యాటును విసిరాడు. అది సుడులు తిరుగుతూ నేలపై బోర్లా పడింది. బ్యాట్‌ ఫ్లిప్‌ గెలిచిన మాక్సీ (స్టార్స్‌) ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన రెనెగేడ్స్‌ 20 ఓవర్లకు కేవలం 142/9 పరుగులే చేసింది. షాన్‌ మార్ష్‌ (43) టాప్‌ స్కోరర్‌. నేపాల్‌ కుర్రాడు సందీప్‌ లామిచాన్‌ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌లో మార్కస్‌ స్టొయినిస్‌ (68*), మాక్స్‌వెల్‌ (40*) అజేయంగా నిలవడంతో మరో 7 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కార్చిచ్చు రగిలింది. 11 మంది మృతిచెందగా ఇంకా 28 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సందర్భంగా కార్చిచ్చు నష్టాన్ని పూడ్చేందుకు సాయం చేసేందుకు మాక్స్‌వెల్‌ ముందుకొచ్చాడు. ఇకనుంచి బిగ్‌బాష్‌లో తాను కొట్టే ప్రతి సిక్సర్‌కు ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్‌ సొసైటీకి 250 డాలర్లు విరాళం అందజేస్తానని ప్రకటించాడు. ప్రస్తుత మ్యాచులోనూ అతడు రివర్స్‌స్వీప్‌ చేసి కళ్లుచెదిరే సిక్సర్‌ బాదేశాడు.

Related posts