telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ ఔటర్‌ రిండ్‌ రోడ్డు పై కొత్త ట్రాఫిక్ రూల్స్‌…

hyderabad roads

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నగరం. అయితే హైదరాబాద్ లో ఉన్న చాలా ప్రత్యేకతలతో‌ ఔటర్‌ రిండ్‌ రోడ్డు (ఓఆర్ఆర్‌) కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఓఆర్ఆర్‌ కొత్త ట్రాఫిక్ రూల్స్‌ వచ్చేస్తున్నాయి… ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా వాహనాలను నడిపితే కదరదు. సిటీలోనూ కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. హెల్మెట్, ర్యాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌.. సిగ్నల్‌ జంపింగ్‌ నిబంధనల్లో ఇప్పటికే మార్పులు రాగా.. ఇప్పుడు ఔటర్‌పై వేగ పరిమితికి సంబంధించిన గుర్తులు వేశారు.. ఓఆర్ఆర్ మొత్తం ఫోర్ లైనర్‌ కాగా… రెండు లైన్లను 100 కిలోమీటర్లకు.. మరో రెండు కిలోమీటర్లను 80 కిలోమీటర్ల గరిష్ట వేగానికి పరిమితం చేశారు. ఓఆర్‌ఆర్‌పై 100 కిలోమీటర్ల గరిష్టవేగానికి 1వ మరియు 2వ లైన్‌ను కేటాయించగా… 80 కిలోమీటర్ల గరిష్ట వేగానికి 3వ మరియు 4వ లైన్‌గా నిర్ణయించారు. గతంలో రోడ్డు పక్కన వేగ సూచకలు ఏర్పాటు చేసేవారు.. కానీ, ఇప్పుడు రోడ్డుపై కూడా స్పీడ్‌ లిమిట్‌కు సంబంధించిన గుర్తులు వేశారు.. 1, 2వ లైన్లలో 100, 3, 4వ లైన్‌లో 80 అంకెలను రాయించారు. అంటే, ఇక, వేగ పరిమితిని అనుసరించి లైన్లను ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే ఓవర్‌ స్పీడ్‌కు జరిమానాలు విధించడమే కాదు… లైన్లు ఫాలో కాకపోయినా జరిమానా తప్పదన్నమాట. మురు కూడా ఓఆర్ఆర్‌ పైకి వెళ్తునట్లైతే జాగ్రత్తగా ఉండండి.

Related posts