telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

రూటుమార్చిన చైన్ స్నాచర్లు : పురుషుల చైన్లు కూడా.. తస్మాత్ జాగర్త ! పోలీసుల హెచ్చరికలు ..

new technique in chain snatching

నేరాలలో కూడా రోజురోజుకు సరికొత్త పంధాలు తెరపైకి వస్తున్నాయి. దీనితో అధికారులకు కూడా ప్రతిసారి నేరస్తులకు తగ్గట్టుగా అప్ డేట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు చైన్ స్నాచింగ్ లో మహిళలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారి పంధా మార్చి పురుషులను కూడా టార్గెట్ చేసుకుని వాళ్ల మెడలోని గొలుసులను లాగేస్తున్నారు. కాస్త ఆర్థికంగా స్తిరపడిన, లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే పురుషులు మెడలో ఓ బంగారు గొలుపు వేళాడేసుకోవడం నగరంలో సర్వ సాధారణం. అలాంటి వారిపై కన్నేసారు కన్నింగ్ కేటుగాళ్లు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతోంది ఓ ముఠా..! చైన్ వేసుకున్న పాపానికి పురుషుల మెడలకు రక్తపు మరకలు చేస్తున్న ఈ కొత్త రకం దొంగలు ఎవరో ఎలా మాటు వేసి చైన్లు లాగేస్తారో మీరు తెలుసుకొని జాగర్త పడండి.

కాంబ్లె శ్యామ్‌సుందర్‌ పాత నేరస్థుడు. ఇతనిపై గతంలో 22 కేసులున్నాయి. పీడీ చట్టం ఏడాది జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక పది మందితో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవీ ఇటీవలి దొంగతనం తాలూకా వివరాలు..! వెంకట నర్సింహ జనవరి 19న మెహిదీపట్నం వెళ్లే బస్సులో ఉండగా లక్డీకాపూల్‌లో కొందరు గొలుసు చోరీ చేశారు. జనవరి 21న బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబరు 1/12 సమీపంలో రద్దీ బస్సులో మిథున్‌ చక్రవర్తి మెడలోని గొలుసు పోయింది. హరీశ్‌రెడ్డి ఫిబ్రవరి 9న బస్సులో ఉండగా గొలుసు అదృశ్యమైంది. అదే రోజు శంకర్‌రావు అనే వ్యక్తి రద్దీ బస్సులో గొలుసు పోయినట్లు నాంపల్లి దగ్గర గుర్తించాడు. ఇటీవల సైఫాబాద్‌లో 4, నాంపల్లిలో 2, నారాయణగూడలో 1కేసు నమోదయ్యాయి. ఈ ఉందంతాల పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వారిని విచారించగా ‘కాంబ్లె శ్యామ్‌సుందర్‌ గ్యాంగ్‌’గా చలామణీ¨ అవుతూ ఎనిమిది చోరీలు చేసినట్లు తేలింది. రెండు నెలలుగా ఇలా చోరీలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 70 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు. సొత్తును మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఒకే బస్తీకి చెందిన ముఠా, శ్యామ్‌సుందర్‌ గ్యాంగ్‌గా చలామణీ అవున్న ఈ బృందం మల్లేపల్లిలోని అఫ్జల్‌సాగర్‌ కు చెందినదిగా గుర్తించారు. ఇరవై నాలుగేళ్ల కాంబ్లె శ్యామ్‌సుందర్‌ అలియాస్‌ శ్యామ్‌, ఇరవై ఏడేళ్ల కాంబ్లె దశరథ్‌ అలియాస్‌ రాజు, ఇరవై ఏళ్ల కాంబ్లె లక్కీ, పందొమ్మిదేళ్ల బి.సాయికుమార్‌, పందొమ్మిదేళ్ల అరుణ్‌ రాజ్‌ గీతా భరత్ ఇందులో సభ్యులు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. అర్థమైంది కదా, పురుషులకు కూడా రక్షణ కరువు.. నాయనలారా తస్మాత్ జాగత్త!

Related posts